KA Paul | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్యాకేజి సార్టు పవన్ కల్యాణ్, షర్మిలాగే తెలంగాణలో చిన్నోడు ఒకడొచ్చాడని అన్నారు. అతని పేరు తీన్మార్ మల్లన్న అని చెప్పారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్నపై అనేక రౌడీ షీటర్లు ఉన్నాయని తెలిపారు.
వైసీపీ ఎంపీ అయిన ఆర్.కృష్ణయ్యతో రాజీనామా చేయించకముందే.. బీజేపీ ఆయన్ను తొత్తుగా వాడుకుంటుందని చెప్పానని కేఏ పాల్ తెలిపారు. అప్పుడు జగన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చారని అన్నారు. అప్పుడు జగన్‌ను ఆర్.కృష్ణయ్య ప్రశంసించారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు పొందారని విమర్శించారు. అలాగే ఏపీలో ప్యాకేజి సార్టు పవన్ కల్యాణ్, షర్మిలాగే తెలంగాణలో తీన్మార్ మల్లన్న వచ్చాడని అన్నారు. నేను బీసీని అని పాట పాడుతూ.. ఆర్.కృష్ణయ్యతో కలిసి 80 కోట్లు ఖర్చు పెట్టి మరీ నిన్న మీటింగ్ పెట్టాడని అన్నారు. మన బడుగు బలహీనవర్గాలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఆర్.కృష్ణయ్య మేం బిచ్చగాళ్లమా? బిచ్చగాళ్లమా అన్నాడని.. కానీ చంద్రబాబును బిచ్చం అడిగాడని.. కేసీఆర్‌ను అడిగాడని.. వైసీపీ అడిగాడని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడు బీజేపీ నేతలను బిచ్చం అడిగి బీసీలను తాకట్టు పెట్టాడని విమర్శించారు. ఆయన శిష్యుడే ఆర్.కృష్ణయ్య అని ఆరోపించారు. దానికి రుజువే నిన్న తెలంగాణలో జరిగిన బీసీల మీటింగ్ అని స్పష్టం చేశారు.
బీసీలారా.. 60 శాతం ఉన్న మనం అమ్ముడుపోవాలా అని కేఏ పాల్ ప్రశ్నించారు. మీకు ఎవరికీ అమ్ముడుపోని నేను ఉన్నానని స్పష్టం చేశారు. చిరంజీవిలా కాంగ్రెస్‌కు.. పవన్‌కల్యాణ్‌లా బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోలేదని తెలిపారు. ఎంత పెద్ద పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చినా సరెండర్ అవ్వలేదని బయటపెట్టారు.
తీన్మార్ మల్లన్న పై ఫైర్ అయిన KA Paul …
👉# షర్మిల, # పవన్ కళ్యాణ్ లాగ , # తీన్మార్ మల్లన్న ఒక అమ్ముడు పోయిన ప్యాకేజీ స్టార్ అని విమర్శించిన @ KA Paul
👉బ్లాక్‌మెయిలర్, రౌడీ అని ,మరియు అమ్ముడు పోయినా వేక్తి అహ్ తీన్మార్ మల్లి. pic.twitter.com/InWgucY2WJ— Prathap (@PR4049) February 4, 2025