Kishore Goud | హైదరాబాద్ : తెలంగాణలోని బీసీలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసిందని బీఆర్ఎస్ నేత కిశోర్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు చట్టం ప్రకారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ ఇవాళ చివరకు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం నమ్మకద్రోహమే అని ధ్వజమెత్తారు.
రాష్ట్ర అసెంబ్లీలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను పచ్చి మోసం, నమ్మక ద్రోహం చేసిందని అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే అంతా బోగస్ సర్వే, బీసీ జనాభాను కావాలనే తక్కువ చేసి చూపించారు అని పేర్కొన్నారు.
ఇప్పటికైనా తిరిగి సర్వే నిర్వహించి కచ్చితమైన లెక్కలు సేకరించి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికల్లో హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన విధంగా రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని కిశోర్ గౌడ్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
SC Sub Classification | ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్రెడ్డి ప్రకటన..