SC Sub Classification | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై సీఎం ఈ ప్రకటన చేశారు. మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్‌కు రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను వర్గీకరణ కమిషన్ గుర్తించిందని చెప్పారు. ఎస్సీ కులాలను గ్రూప్ -1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్-1లోని 15 ఉపకులాలను ఒకశాతం రిజర్వేషన్‌కు సిఫారసు చేసిందన్నారు.
గ్రూప్-1లోని 15 ఉపకులాల జనాభా 3.288శాతంగా ఉండగా.. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసం సిఫారసు చేశామన్నారు. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాల జనాభా 62.748 శాతంగా ఉన్నారని.. గ్రూప్-3లోని ఎస్సీ ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసినట్లు చెప్పారు. ఈ గ్రూప్-3లోని 26 ఉప కులాల జనాభా 33.963శాతంగా ఉన్నట్లు సీఎం వివరించారు. అంతకు ముందు ఇక ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం తెలిపింది. వర్గీకరణకు ఆమోదం అనంతరం శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.