KTR | హైదరాబాద్ : సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి అని ఆయన కొనియాడారు.
దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థగా పేరు గాంచిన సింగరేణి.. వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో మూల స్తంభంగా నిలిచిందని కేటీఆర్ ప్రశంసించారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి.. బొగ్గు ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ.. కార్మికుల పాలిట కల్పవల్లిగా, తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారంగా మారింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం.. సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు. సింగరేణి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.. జై సింగరేణి! అంటూ కేటీఆర్ నినదించారు.
ఇవి కూడా చదవండి..
Nallagonda | పోలీసులు కేసు నమోదు చేయట్లేదని.. సెల్ టవరెక్కి ఆటో డ్రైవర్ హల్చల్
Harish Rao | అడిగినవాళ్లను అదరగొడుతుండు.. ప్రశ్నిస్తే పగబడుతుండు.. రేవంత్‌పై హరీశ్ ఫైర్
Indian Student | అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి