Indian Student | అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Indian Student | అగ్రరాజ్యం అమెరికా (America)లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Indian Student | అగ్రరాజ్యం అమెరికా (America)లో ఇటీవలే వరుసగా భారతీయ విద్యార్థుల (Indian Students) మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాల కోసం యూఎస్ వెళ్లిన పలువురు విద్యార్థులు అక్కడ జరిగిన ప్రమాదాల్లో మరణిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన 25 ఏళ్ల బండి వంశీ గతేడాది జులైలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ మిన్నెసొటాలో పార్ట్‌టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చదువుతున్నాడు. అయితే, అతడు ఆదివారం తాను ఉంటున్న అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కారులో శవమై కనిపించాడు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న హన్మకొండ జిల్లాకు చెందిన యువకులు ఆదివారం ఉదయం వంశీ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వంశీ మృతితో మాదన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read..
CV Anand | సహనం కోల్పోయా.. క్షమించండి: సీవీ ఆనంద్ పోస్ట్
MLC Kavitha | ..ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి: ఎమ్మెల్సీ కవిత
Harish Rao | క్రిస్మన్ పండుగను అధికారికంగా నిర్వహించిన ఒకేఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్: హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

