MLC Kavitha | ..ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి: ఎమ్మెల్సీ కవిత
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు.
హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
‘ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం , రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనం.’ అంటూ ట్వీట్ చేశారు.
ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు… pic.twitter.com/uhJKSv1mxK
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

