Nallagonda | నల్లగొండ : పోలీసులు కేసు నమోదు చేయట్లేదని చెప్పి ఓ ఆటో డ్రైవర్ సెల్ టవరెక్కి హల్ చల్ సృష్టించాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కట్టంగూర్ మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన చిలుముల చింతాలు వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. రెండు రోజుల క్రితం నకిరేకల్ పట్టణంలో కొంతమంది వ్యక్తులు అతనిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో చింతాలు నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దాంతో తనకు న్యాయం చేయాలని అయిటిపాముల జాతీయ రహదారి పక్కన ఉన్న రిలయన్స్ సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్.. తన న్యాయం చేయాలంటూ హల్ చల్ సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నీపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని నచ్చజెప్పడంతో చింతాలు సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. అనంతరం అతన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అడిగినవాళ్లను అదరగొడుతుండు.. ప్రశ్నిస్తే పగబడుతుండు.. రేవంత్‌పై హరీశ్ ఫైర్
Indian Student | అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Harish Rao | క్రిస్మన్ పండుగను అధికారికంగా నిర్వహించిన ఒకేఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్: హరీశ్‌రావు