KTR | హైదరాబాద్ : కార్యక్షేత్రంలో ప్రతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న మా పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరో నాలుగేండ్లు ఈ పోరాటాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొన్ని అబద్దాలు పదేపదే వల్లె వేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెప్తే నిజమైపోతదనే నానుడి ఏదైతో ఉందో దాన్ని అనుసరించుకుని ఇవాళ జోసెఫ్ గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకుని ఈ సీఎం, మంత్రివర్గం ప్రయత్నం చేస్తోంది. ప్రజలు, మీడియా దృష్టికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి తెలియజేయాలని ఈ సమావేశం నిర్వహించాం అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి సంవత్సరం అయింది. బాక్సింగ్ క్రీడలో ఒక సామెత ఉంటది.. ఎంత గట్టిగా పంచ్ విసరగలిగామన్నది కాదు.. ఎంత గట్టిగా పంచ్‌ను విసిరినా తట్టుకుని తిరిగి నిలబడాలన్నది ముఖ్యం. ఇది క్రీడాకారుడికి పరీక్ష. ఆ విధంగా ఈ ఏడాది కాలంలో బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన, కేసీఆర్‌కు గాయమైనా.. కవితను అరెస్టు చేసి ఐదున్నర నెలలు జైల్లో పెట్టినా, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని ఓటమి పాలైనా.. మా పార్టీ జెండా మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా.. కేసులు పెట్టినా, అవమానాలకు గురి చేసినా తట్టుకుని నిలబడ్డాం. లగచర్లలో గిరిజన రైతుల పక్షానా నిలబడ్డాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరుబాట పట్టామని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ రోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. హైడ్రా, మూసీ బాధితులతో పాటు పలువురు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులు తమ వేదనను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి.. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని వాలంటీర్లుగా పని చేస్తున్న వారికి, సోషల్ మీడియా సైనికులకు, ప్రతి రోజు కాంగ్రెస్‌తో తలపడుతున్న కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న నాయకులకు ధన్యవాదాలు అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి : కేటీఆర్
Harish Rao | హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావు క్వాష్ పిటిషన్
KTR | కేసీఆర్ మీద కోపంతో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు : కేటీఆర్