KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులతో పూజించడం కాకుండా, పువ్వులనే పూజించే అరుదైన, అపురూపమైన పండగ బతుకమ్మ అని కేటీఆర్ పేర్కొన్నారు.
విభిన్నమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప వేడుక మన బతుకమ్మ పండుగ అని కేటీఆర్ కొనియాడారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి.. గత ఎనిమిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులందరూ భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో సంబురంగా జరుపుకున్న బతుకమ్మ పండగ.. నేడు తొమ్మిదవ రోజుకు చేరుకుంది. తెలంగాణ మహిళలకు, ఆడపిల్లలకు ఎంతో ప్రీతిపాత్రమైన సద్దుల బతుకమ్మ పండుగ నేడు. బతుకమ్మ పాటలతో, కోలాటాలతో రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రజలందరూ వైభవోపేతంగా జరుపుకోవాలని ఆశిస్తూ.. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బతుకమ్మ.. మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసాదించాలి : హరీశ్‌రావు
MBBS seats | ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్ సీట్లు.. ఫలిస్తున్న కేసీఆర్ కృషి