Harish Rao | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ప్రజలకు, మహిళలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మహిళలు అత్యంత ఇష్టపూర్వకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు.
పుష్పాలను పూజించి, ప్రేమించేది తెలంగాణ ప్రజలే. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఎంతో ఖ్యాతిని సంపాదించింది. మన బతుకమ్మ పండుగను అమెరికా కూడా అధికారికంగా గుర్తించడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతి బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ బతుకమ్మ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసాదించాలని, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.#Bathukamma pic.twitter.com/PuLwzCcwCN
— Harish Rao Thanneeru (@BRSHarish) October 10, 2024
ఇవి కూడా చదవండి..
Telangana | దేవుళ్లకూ తప్పని తిప్పలు.. ఆలయాల సొమ్ముపై రేవంత్ సర్కారు పన్ను
Revanth Reddy | కొత్త టీచర్ల ముందు సీఎం తిట్లదండకం.. స్ఫూర్తినివ్వాల్సింది పోయి బూతుపురాణం