Vinod Kumar | హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు కేసీఆర్ భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పగలరా..? అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఆయన మంత్రివర్గ సహచరులు కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనట్టు మాట్లాడడం సరికాదన్నారు వినోద్ కుమార్. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఉపాధ్యాయుల నియామకాల ప్రోగ్రాంను సీఎం రాజకీయ వేదికగా వాడుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీసేస్తే మీకు ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులనుద్దేశించి అన్నారు. కేసీఆర్ హయాంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చాం. మేము సరిగా చెప్పుకోలేకపోయాం. మార్కెటింగ్‌లో రేవంత్ రెడ్డిని మించినోడు లేడు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారి అని రేవంత్ తనకు తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న వారు మార్కెటింగ్‌లో ఎలా ఉంటారో తెలియదా..? అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో లక్షా 60వేల ఉద్యోగాలు ఇచ్చాము. ఈ విషయం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌కు తెలియకపోతే వారు మంత్రులుగా ఉండటానికి అనర్హులు. కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి అని మంత్రులు అడుగుతున్నారు.. వారికి తెలియదా..? ప్రభుత్వం వద్ద లెక్కలు లేవా..? ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో నిర్ధారించారా..? నిర్ధారిస్తే ఆ వివరాలు రేవంత్ రెడ్డి చెప్పాలి. నిన్న మీరు ఇచ్చిన ఉపాధ్యాయ నియామకాలు కూడా సెప్టెంబర్ 6, 2023 నాడు ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపే. కేవలం ఆరు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లో అదనంగా కలిపారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
డిసెంబర్ 31, 2024 లోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. ఆ ప్రకారం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ చేయాలి. రిక్రూట్మెంట్ సైకిల్లో భాగంగా మొదట ఉద్యోగ ఖాళీలు గుర్తించాలి.. ఆ పనే జరగలేదు. కోదండరాం ఏం చేస్తున్నారు.. సెక్రటేరియట్ వెళ్లి ఖాళీలు గుర్తించి సీఎం రేవంత్‌కు జాబితా ఇవ్వొచ్చు కదా..? నిరుద్యోగులతో సభ పెట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయో రేవంత్ చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Konda Surekha | నాగార్జున పిటిషన్‌పై విచారణ.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు..
KTR | మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్