Manda Krishna Madiga | ఎస్సీ వర్గీకరణ తర్వాతే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలి.. రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ డిమాండ్
Manda Krishna Madiga | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాలకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేసి, కమిషన్ల పేరుతో జాప్యం చేసి, ఉన్న ఉద్యోగాలను కొల్లగొడుతాం అంటే మాదిగ జాతి ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు.
Manda Krishna Madiga | హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాలకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేసి, కమిషన్ల పేరుతో జాప్యం చేసి, ఉన్న ఉద్యోగాలను కొల్లగొడుతాం అంటే మాదిగ జాతి ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-1 పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే తమ బిడ్డలు పదేండ్లు నష్టపోతారని, ఐఏఎస్‌లుగా అవకాశాలు కోల్పోతారని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకూ వర్గీకరణ చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని మందకృష్ణ గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి మరిచారు. వర్గీకరణ చేయకుండానే డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. గ్రూప్-1 పోస్టులకు వర్గీకరణ వర్తింపజేయాలి. వర్గీకరణ తర్వాతే గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహించాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 2 నెలల్లో పూర్తి చేయాలని, అప్పటి వరకు కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయొద్దని రేవంత్ ఆదేశించారు. గ్రూప్-1, 2, 3 పరీక్షలు కూడా రెండు నెలలు ఆపి, రిజర్వేషన్లు పూర్తయ్యాకే పరీక్షలు నిర్వహించాలి. వర్గీకరణ చేయకుండా పరీక్షలు నిర్వహిస్తే ఉద్యమిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Konda Surekha | నాగార్జున పిటిషన్‌పై విచారణ.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు..
KTR | మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
Harish Rao | బతుకమ్మ.. మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసాదించాలి : హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

