Konda Surekha | హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇవాళ రెండో సాక్షి స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. ఇప్పటికే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ తన కుటంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగార్జున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
నాంపల్లి ప్రత్యేక కోర్టులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై కేటీఆర్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించారని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను కేటీఆర్ సాక్షులుగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
KCR | ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా : కేసీఆర్