KTR | మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
KTR | నాంపల్లి ప్రత్యేక కోర్టులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై కేటీఆర్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
KTR | హైదరాబాద్ : నాంపల్లి ప్రత్యేక కోర్టులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై కేటీఆర్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించారని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను కేటీఆర్ సాక్షులుగా పేర్కొన్నారు.
ఇప్పటికే కొండా సురేఖకు లీగల్ నోటీసులు..
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తన పట్ల చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడరని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని.. మహిళ అయిఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమన్నారు.
అసలు తనకు సంబంధమే లేని ఫోన్ టాపింగ్, ఇతర అంశాలపైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారన్నారు. ఎలాంటి సాక్షాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని.. ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడనే సోయి లేకుండా మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసు వేస్తామని కేటీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
KCR | ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా : కేసీఆర్
Revanth Reddy | కొత్త టీచర్ల ముందు సీఎం తిట్లదండకం.. స్ఫూర్తినివ్వాల్సింది పోయి బూతుపురాణం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

