KTR | హైదరాబాద్ : కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా గత ఆరు నెలల నుంచే పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొడంగల్ ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్ర లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ముచ్చర్లలో ఫార్మాసిటీ రద్దు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే భూములు ఇచ్చిన రైతులు సంతోష పడ్డారు. ఎందుకంటే వాళ్ల భూములు వాళ్లకు ఇస్తామని చెప్పారు కనుక భూములు ఇస్తారని రైతులు ఆశ పడ్డారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఫార్మా సిటీ రద్దు కాదు…మళ్లీ మేము ఫార్మా విలేజ్ పెడతామని చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఫార్మా సిటీ పేరును ఫార్మా విలేజ్‌గా మార్చారని కేటీఆర్ తెలిపారు.
ఫార్మా రంగాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో, అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ తేవాలని మేము 14 వేల ఎకరాలు సేకరించాం.
మాకు ఏదో తెలియకుండా ఇదంతా చేయలేదు. తెలంగాణను ఫార్మా రంగంలో లీడర్ చేయాలని భావించాం. ఫార్మా సిటీని ప్రపంచంలో ఉన్నంతగా తీర్చిదిద్దేందుకు అధికారులు విదేశాల్లో కూడా పర్యటన చేశారు. ఐతే మొన్నటి ఎన్నికల తర్వాత ఫార్మా సిటీ పూర్తిగా చేద్దామని భావించాం. అదే విధంగా భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అలాంటి ఫార్మా సిటీని వదిలి…ఈ ముఖ్యమంత్రి తుగ్లక్, మూర్ఖ నిర్ణయాలు తీసుకున్నాడు. దాని కారణంగానే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్ర లేదు. కొడంగల్ లో ఫార్మా విలేజ్ విషయంలో ఆరు నెలల నుంచే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ముందుచూపుతోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ : కేటీఆర్
Koppula Eshwar | ఇందిరమ్మ రాజ్యంలో.. రాక్షస పాలన : కొప్పుల ఈశ్వర్
Patnam Narender Reddy | డ్యామేజీ కంట్రోల్ కోసమే నన్ను అరెస్టు చేశారు : పట్నం నరేందర్ రెడ్డి