KTR | వరంగల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన ఇద్దరు గిరిజన పిల్లలకు కేటీఆర్ ఆర్థిక చేయూతను అందించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇద్దరు పిల్లలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం 16 చింతలతండా గ్రామంలో జులై రెండో వారంలో ఓ ప్రేమోన్మాది.. గిరిజన దంపతులపై దాడి చేసి, చంపేశాడు. ఆ దాడిలో దంపతుల ఇద్దరు పిల్లలు దీపక, మదన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ పిల్లలకు తాను అండగా ఉంటానని, రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తానని కేటీఆర్ నాడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతుల ద్వారా అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ.. దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం 16 చింతలతండా గ్రామంలో ఉన్మాది దాడిలో తల్లితండ్రులను ఇద్దరినీ కోల్పోయి, తాము తీవ్రంగా గాయపడిన ఇద్దరు గిరిజన పిల్లలు దీపిక, మదన్‌కు ఇచ్చిన మాటమేరకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతుల ద్వారా అందజేయడం జరిగింది https://t.co/fJCbUtHmMj pic.twitter.com/GH18ff2jue
— KTR (@KTRBRS) August 29, 2024
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | 160 రోజుల విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత తొలి ట్వీట్.. సత్యమేవ జయతే అంటూ పోస్ట్
KCR | కవితను చూడగానే భావోద్వేగానికి లోనైన తండ్రి కేసీఆర్