KCR | హైదరాబాద్ : తన బిడ్డ కవితను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి పాదాలకు కవిత నమస్కరించారు. బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని ఆశీర్వదించారు. ఎర్రవెల్లి నివాసానికి కవిత తన భర్త, కుమారుడితో కలిసి ఇవాళ మధ్యాహ్నం వెళ్లారు.
ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూడగానే కేసీఆర్ ముఖంలో ఆనందం కనిపించింది. చాలాకాలం తర్వాత ఉత్సాహంతో అధినేత కేసీఆర్ ఉన్నారు. తమ అధినేత సంతోషంలో పార్టీ నాయకులు, సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది.
ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కవిత కలిసి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసున్నారు. కన్న బిడ్డను చూడగానే కేసీఆర్ భోవోద్వేగానికి గురై గుండెలకు హత్తుకున్నారు. @RaoKavitha pic.twitter.com/7lzJuqo1I9
— Namasthe Telangana (@ntdailyonline) August 29, 2024
ఇవి కూడా చదవండి..
Passport | సెప్టెంబర్ 2 వరకు పాస్పోర్టు సేవలకు అంతరాయం
KTR | విద్యార్థులంటే.. ఈ కాంగ్రెస్ సర్కార్కు ఎందుకింత చిన్నచూపు..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?