MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత.. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఐదు నెలల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సొంత గడ్డపై కవితకు అపూర్వ స్వాగతం లభించింది.ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఎక్స్ వేదికగా తొలి ట్వీట్ (first tweet) పెట్టారు. సత్యమే గెలిచిందంటూ పేర్కొన్నారు.
‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు తన నివాసానికి చేరుకున్న అనంతరం భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. యాదాద్రి ఆలయంఫొటో పేపర్ క్లిప్‌ను షేర్ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు … KCR నిర్మించాడు !!’ అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత అక్రమ కేసులో కవితను అరెస్ట్ చేయడంతో అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. 160 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఎక్స్‌లో తొలి ట్వీట్ చేశారు.
సత్యమేవ జయతే pic.twitter.com/Q0HzR0aouy
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2024
Also Read..
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు సొంత గడ్డలో ఘనస్వాగతం.. ఫొటోలు
KTR | కష్ట కాలంలో అన్నీ తానై.. అనుక్షణం కవితకు తోడుగా నిలిచిన కేటీఆర్
MLC Kavitha | వసంత విహార్‌లో కోలాహలం.. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించిన ఎమ్మెల్సీ కవిత