MLC Kavitha | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలోని వసంత విహార్ బీఆర్ఎస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమె నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు వసంత విహార్‌లోని పార్టీ కార్యాలయంలోనే బసచేశారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఆమె బయలుదేరుతారనే విషయాన్ని తెలుసుకున్న పార్టీ శ్రేణులు, నాయకులు, వివిధ వర్గాల ప్రముఖులు తెలంగాణ భవన్‌కు చేరుకోవడంతో అక్కడ అంతా సందడిగా మారింది.
తన అన్న కేటీఆర్, కొడుకు ఆదిత్యతో కవిత కొద్దిసేపు సరదాగా గడిపారు. ఉదయం నుంచే ఆమెను కలిసేందుకు పార్టీ శ్రేణులు పోటీపడ్డారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఆమె పేరుపేరునా పలకరించారు. ఆమెతో వారు ఫొటోలు దిగారు. తనను కలిసిన జాతీయ మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు.
తరువాత సీబీఐ చార్జిషీట్‌పై వర్చువల్ విచారణలో పాల్గొన్నారు. అనంతరం భర్త అనిల్‌రావు, కొడుకు ఆదిత్య, అన్న కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, బీ లక్ష్మారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, కర్నె ప్రభాకర్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, కే వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, వై సతీశ్‌రెడ్డి తదితరులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం కేటీఆర్ సహా నేతలంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.