చెల్లికి అండగా అన్న..
ఆనందంతో కవితను హత్తుకున్న కేటీఆర్
స్వాగతం పలుకుతున్న సంతోష్..
శంషాబాద్ విమానాశ్రయంలో కవిత వెంట వస్తున్న సంతోష్‌కుమార్. చిత్రంలో కేటీఆర్, కవిత భర్త అనిల్, కుమారుడు ఆదిత్య తదితరులు
పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఇంటికి..
పార్టీ కార్యకర్తలతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఇంటికి వెళ్తున్న కవిత
ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి పోవాలని..
ఇంటికి చేరుకున్న కవితకు దిష్టి తీస్తున్న మహిళ
బంజారాహిల్స్‌లోని ఇంటి వద్ద అభిమానులకు అభివాదం చేస్తున్న కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరు(ఎం) మండలంలోని రాఘవాపురం శివారులో బుధవారం పొలం వద్ద రైతులు, వ్యవసాయ కూలీలు సంబురాలు జరుపుకొన్నారు. వరి పొలంలో కలుపు తీసేందుకు వచ్చిన మహిళా కూలీలు బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి స్వీట్లు పంచుకున్నారు.
– ఆత్మకూరు(ఎం)