KTR | హైదరాబాద్ : మూసీ మే లూటో…ఢిల్లీ మే బాటో అనే విధంగా ఉన్నది కాంగ్రెస్ నేతల తీరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఉండాలంటే ఢిల్లీకి మూటలు పంపాలి.. అందుకే మూసీలో డబ్బులు లూటీ చేసి, బ్యాగులు ఢిల్లీకి పంపుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటింది. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. రాహుల్ గాంధీకి డబ్బులు కావాలి. ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బులు పంచాల్సిందే. అందుకే మూటలు పంపే పనిలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణలో పదేళ్లలో భారీగా భూముల ధరలు పెరిగాయి. అప్పుడు మేము పారదర్శకంగా భూముల వేలం వేస్తే ఒక ఎకరాకు వందకోట్లు పోయింది. అప్పుడు కూడా అందులో స్కాం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఓఆర్ఆర్ లీజును ఒక సంస్థకు రూ. 7 వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వచ్చేదాన్ని రూ. 7 వేల కోట్లే ఇచ్చారన్నాడు. మరీ ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా? ఆ టెండర్ రద్దు చేసి రూ. లక్ష కోట్లు తీసుకురా. నేను కోకాపేట భూముల్లో అవినీతి చేశానని అన్నావ్. విచారణ జరుపు. తప్పు చేస్తే శిక్ష వేయ్ అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
మూసీమే లూటో.. ఢిల్లీకో బాటో
రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఉండాలంటే ఢిల్లీకి మూటలు పంపాలి.. మూసీలో డబ్బులు లూటీ చేసి, బ్యాగులు ఢిల్లీకి పంపుతున్నాడు – కేటీఆర్ pic.twitter.com/QJBauHuAHF
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2024
ఇవి కూడా చదవండి..
KTR | దేవుళ్లనే మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే.. కేటీఆర్ సెటైర్లు
KTR | హైదరాబాదీల చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా : కేటీఆర్
KTR | కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. బీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు : కేటీఆర్