KTR | హైదరాబాద్ : రుణమాఫీ విషయంలో దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఒట్లు వేశాడు రేవంత్ రెడ్డి. దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి. ఎత్తైన కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారు. లేదంటే రెండు కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారు. ఎత్తయిన కుర్చీలో కూర్చొంటే పెద్దోడివి అయిపోవు రేవంత్ రెడ్డి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తా అన్నాడు. దాని కోసం రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తోంది. మూడు పంటలకు రైతు భరోసా ఎక్కడ పోయింది. వానాకాలం రైతుబంధు ఇంకా ఖాతాల్లో పడలేదు. రైతున్నలు మోసపోయామని బాధపడుతున్నారు. రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పి మోసం చేశావు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాటిచ్చి తప్పావు. ఇక ఆ తర్వాత ఏ దేవుడి వద్దకు వెళ్తే.. అక్కడ ఒట్లు. నిన్న దేవుళ్లందరూ మీటింగ్ పెట్టుకున్నారట.. వీడు ఎక్కడ దొరికిండ్రా నాయానా.. మనకు ఏడ కనబడితే అడ ఒట్లు వేస్తున్నాడని అనుకున్నారంట. మనషులను మోసం చేసిన వారు ఉన్నారు. దేవుళ్లను మోసం చేసిన తొలి వ్యక్తి ఈయనే. పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీష్ రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది? మరి ఏడ పోయింది రుణమాఫీ.. జేపీ దర్గా వద్ద కూడా ఒట్టు పెడితివి. నీ ఒట్లకు మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి..
KTR | హైదరాబాదీల చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా : కేటీఆర్
KTR | కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. బీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు : కేటీఆర్
BRS Party | రాజేంద్రనగర్లో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన మాల్యాద్రి