BRS Party | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చతికిలబడిపోతోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధినాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమేనని భావిస్తున్న హస్తం నాయకులు.. కారెక్కెందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రి నాయుడు, ఇతర నాయకులు గులాబీ గూటికి చేరారు. వీరందరికి తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Lagacharla | లగచర్ల దాడి.. మరో ఎనిమిది మంది అరెస్టు
KTR | జాగో తెలంగాణ.. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుంది: కేటీఆర్
Telangana Cabinet | వాయిదాలు దాటుతున్నా అందని ద్రాక్షే.. ఊరిస్తున్న క్యాబినెట్ విస్తరణ