హైదరాబాద్: సన్నాలకు బోనస్‌పై కాంగ్రెస్ సర్కార్ సవాలక్ష కొర్రీలు పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందన్నారు. 420 హామీల కాంగ్రెస్ పాలనో రైతుభరోసా రూ.15 వేలు రాలేదని, రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, 24 గంటల ఉచిత కరెంటు మాయమైందని విమర్శించారు. పంటల కొనుగోళ్లు చెయ్యలేదని, వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ రూ.500 ఇయ్యలేదన్నారు. జాగో తెలంగాణ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
‘శేలు దప్పినోడు శేను వెడ్తె వడగండ్ల వానొచ్చి పోయిందని. 420 హామీల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రూ.15 వేలు రాకపాయె. రుణమాఫీ రూ.2 లక్షలు కాకపాయె. 24 గంటల ఉచిత కరంటు మాయమాయె. పంటల కొనుగోళ్లు చెయ్యకపాయె. వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ రూ.500 ఇయ్యకపాయె. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుంది.. జాగో తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు.
శేలు దప్పినోడు శేను వెడ్తె
వడగండ్ల వానొచ్చి పోయిందని420 హామీల కాంగ్రెస్ పాలనలో
రైతుభరోసా రూ.15 వేలు రాకపాయె
రుణమాఫీ రూ.2 లక్షలు కాకపాయె
24 గంటల ఉచిత కరంటు మాయమాయె
పంటల కొనుగోళ్లు చెయ్యకపాయె
వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ రూ.500 ఇయ్యకపాయె
అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే… pic.twitter.com/ZFya7fNt9X
— KTR (@KTRBRS) November 16, 2024