KTR | హైదరాబాద్ : దళితులకు దళితబంధు ఆర్థిక సాయం అడిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తారా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు పని చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారు. అరికెపూడి గాంధీతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న కౌశిక్ రెడ్డిపై సీఎం దాడి చేయించారు. దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులు ఎవరూ భయపడరు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భారీ అవినీతి.. మండిపడ్డ కేటీఆర్