Harish Rao | అంబేద్కర్ విగ్రహం సాక్షిగా.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
Harish Rao | అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇది ప్రజా పాలన కాదు.. రేవంత్ మార్కు రాక్షస పాలన.. కాంగ్రెస్ మార్కు నిరంకుశ పాలన.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో @BRSparty ఎమ్మెల్యే @KaushikReddyBRS పై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి… pic.twitter.com/bciC5ZDHVt
— Harish Rao Thanneeru (@BRSHarish) November 9, 2024
ఇవి కూడా చదవండి..
KTR | నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భారీ అవినీతి.. మండిపడ్డ కేటీఆర్
Harish Rao | గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లలో సీఎం, మంత్రులు..! హరీశ్‌రావు తీవ్ర విమర్శ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

