Harish Rao | మెదక్ : మీ అన్యాయాలను ప్రశ్నిస్తూ.. మోసాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నావ్ అంటే.. అది రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడమే అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.
కేటీఆర్‌ను అరెస్టు చేయిస్తా అని లీకులు రాయిస్తున్నారు. కేటీఆర్ ఏం చేసిండు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు. రాష్ట్ర గౌరవం, ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరును కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ వన్‌గా చేసిండు. నువ్వేమో డైవర్షన్ కోసం కేసులు పెడుతా..? అరెస్టులు చేయిస్తా..? అని లీకులు ఇస్తున్నవ్. నీ లీకులకు, తాటాకు చప్పుళ్లకు ఎవడు భయపడడు. ఇవాళ కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నావ్ అంటే అది ప్రశ్నించే గొంతు మీద కుట్ర. ప్రశ్నించే గొంతు మీద దాడి. కేటీఆర్ నీ ప్రభుత్వాన్ని బట్టలు విప్పిండు. మీ అన్యాయాలను ప్రశ్నించిండు. మీ మోసాలను ఎండగట్టిండు. అందుకే నీవు కేటీఆర్ మీద పగ పట్టినవ్.. కక్ష పెంచుకున్నవ్. కానీ ఈ దాడి ఒక్క కేటీఆర్ మీద కాదు.. ఇది రాష్ట్ర ప్రజల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడిగా మేం చూస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజా స్వామికం. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి సీఎం, మంత్రులు గాలిమోటార్లలో చక్కర్లు కొడుతున్నారు. మూసీ దురావస్థకు కారణం కాంగ్రెస్, టీడీపీల పాలననే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
రేవంత్.. నీ మోసాలను, అన్యాయాలను, అవినీతిని ఎండగట్టిన ప్రశ్నించే గొంతు @KTRBRS గారి మీద అక్రమ కేసుతో కుట్ర చేయడమంటే అది రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడమే.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/yF8zByHjEi
— BRS Party (@BRSparty) November 9, 2024
ఇవి కూడా చదవండి..
KTR | నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భారీ అవినీతి.. మండిపడ్డ కేటీఆర్
Nagarjuna Sagar | ఇక్కడ మీకేం పని.. సాగర్ డ్యామ్‌పై తెలంగాణ అధికారులను అడ్డుకున్న ఏపీ ఆఫీసర్లు