Nagarjuna Sagar | ఇక్కడ మీకేం పని.. సాగర్ డ్యామ్‌పై తెలంగాణ అధికారులను అడ్డుకున్న ఏపీ ఆఫీసర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణానది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది.
నల్లగొండ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణానది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్ కుడి కాలువ వాటర్ లెవల్స్ తీసుకోవడానికి తెలంగాణ అధికారులు వెళ్లారు. దీంతో ఆంధ్ర అధికారులు వారిని అడ్డుకుని.. ఇక్కడ మీకేం పని అంటూ నిలదీశారు. నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చేప్పేది లేదని, రీడింగ్ తీయొద్దంటూ అడ్డుకున్నారు. మీరు ఎవరికైనా చెప్పుకోండని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో విషయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు, కేఆర్ఎంబీ సమాచార గ్రూపులతో పాటు అధికారులకు నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ ఇరిగేషన్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులను కేఆర్ఎంబీ అధికారులు సర్ధిచెప్పారు.
గతేడాది నవంబర్‌లో నాగార్జున సాగర్ డ్యామ్‌పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం తలెత్తడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు డ్యామ్‌పై పెద్దఎత్తున మోహరించారు. డ్యాప్‌పై కంచెలు వేసి ఇరువైపులా భారీగా బలగాలను దించడంతో యుద్ధవాతావరణం నెలకొన్నది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ నవంబర్లోనే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

