KTR | హైదరాబాద్ : నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ పనులు మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్కు అప్పగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ ప్రాజెక్టు పనులు మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్స్కు కేకు ముక్కల్లా పంచారు. ఎల్ అండ్ టీ, ఎన్సీసీ(నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ) లాంటి కంపెనీలను కాదని ఎక్కువ కోట్ చేసిన మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఎలా కట్టబెడుతారు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టాల్సింది పోయి మేఘాకే ఈ ప్రాజెక్టును గిఫ్ట్‌గా ఇచ్చారు. కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటీఎంగా వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే రూ. 4,350 కోట్ల ప్రజాధనాన్ని కొందరికి అప్పగించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
అయితే మొదట టెక్నికల్ బిడ్స్ తెరిచి నిర్మాణ సంస్థల అర్హతలు, సాంకేతిక అంశాలను అధికారులు పరిశీలించారు. ఎల్ అండ్ టీ, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనర్హతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రైస్ బిడ్స్ తెరవగా మిగిలిన రెండు సంస్థలు ఒక్కో ప్యాకేజీ దక్కించుకున్నాయి.
మొదటి ప్యాకేజీ కింద రూ. 1,134.62 కోట్ల పనులకు పిలిచిన టెండర్‌కు 3.9 శాతం అధికంగా కోట్ చేసిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎల్-1గా నిలిచింది. 4.85 శాతం అధికంగా కోట్ చేసిన మేఘా ఎల్-2గా నిలిచింది. రెండో ప్యాకేజీ కింద రూ. 1,126.85 కోట్ల పనులకు పిలిచిన టెండర్‌కు 3.95 శాతం అధికంగా కోట్ చేసిన మేఘా ఎల్-1గా, 4.80 శాతం అధికంగా కోట్ చేసిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎల్-2గా నిలిచాయి.
In CM’s constituency, the Narayanpet-Kodangal Lift tenders lay bare the Congress government’s ugly crony capitalism & rampant corruption!
Two industry giants L&T and NCC were “disqualified” to favour Minister Ponguleti’s Raghava Constructions & Megha Engineering, both of whom… pic.twitter.com/gRUSJy2RHD
— KTR (@KTRBRS) November 9, 2024
ఇవి కూడా చదవండి..
Nagarjuna Sagar | ఇక్కడ మీకేం పని.. సాగర్ డ్యామ్‌పై తెలంగాణ అధికారులను అడ్డుకున్న ఏపీ ఆఫీసర్లు
Y Satish Reddy | 100 ఏండ్ల తర్వాత కూడా కేసీఆర్ పేరును గుర్తు పెట్టుకుంటారు : వై సతీశ్ రెడ్డి
Harish Rao | గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లలో సీఎం, మంత్రులు..! హరీశ్‌రావు తీవ్ర విమర్శ