KTR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంచారు.. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు. గుర్తు పెట్టుకో మిస్టర్ ‘చీప్’ మినిస్టర్ రేవంత్ అని కేటీఆర్ చురకలంటించారు.
నువ్వు స్లిప్పర్లు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే.. ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశాడని కేటీఆర్ పేర్కొన్నారు. నువ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే.. ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడు. ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు… ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు ‘డబ్బుల బ్యాగులు’ పట్టుకున్నప్పుడు.. సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదును పెట్టారు. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ఆయన ఈ రాష్ట్రానికి గర్వకారణం. నీలాంటి జోకర్ ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు. గుర్తు పెట్టుకో మిస్టర్ ‘చీప్’ మినిస్టర్ రేవంత్ అని కేటీఆర్ పేర్కొన్నారు.
When you were an errand boy, carrying slippers for political favors, he resigned from his position, for the people of TELANGANA!
While you were busy lobbying for party tickets, he envisioned a dream – a TELANGANA born from struggle and perseverance
As you wielded guns to… pic.twitter.com/fpPNadoAvO
— KTR (@KTRBRS) November 9, 2024
ఇవి కూడా చదవండి..
SSC Exams | మార్చిలో పదో తరగతి పరీక్షలు.. 18 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు గడువు
Grama Kantam | గ్రామకంఠం భూములపై అధికారం ఎవరిది?.. ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు