Grama Kantam | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయో, ఆ భూములపై ఏ శాఖకు అధికారం ఉంటుందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామకంఠం భూముల రక్షణ బాధ్యతలను ఎవరు చేపడతారో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, కందుకూర్ ఎంపీడీవో, తాసిల్దార్‌కు నోటీసులు జారీ చేసింది.
కందుకూర్ మండలం బాబుపల్లిలో 6.15 ఎకరాల గ్రామకంఠం భూమి ఆక్రమణలకు గురైందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణలో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.