SSC Exams | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా 18లోగా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు. ఫీజులను పాఠశాల హెచ్ఎంలకు చెల్లించాలని, వారు బోర్డుకు చెల్లించాలని వెల్లడించారు.