Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసులో జైలుకు రాజ్‌పాల్ యాదవ్.. సల్మాన్, అజయ్ సహా సాయమందిస్తున్న బాలీవుడ్
Rajpal Yadav : రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ తిహార్ జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి అతడు జైలులోనే ఉన్నాడు.
Rajpal Yadav : రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ తిహార్ జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి అతడు జైలులోనే ఉన్నాడు. తన దగ్గర డబ్బులు లేవని, వాటిని తిరిగి చెల్లించే స్థితి లేదని అతడు అంతకుముందు మీడియాకు తెలిపాడు. తనను ఆదుకునే స్నేహితులు కూడా లేరని చెప్పాడు. ఇక.. తప్పనసరిగా జైలుకు వెళ్లాల్సిందే అని, ఈ పరిస్థితిని తనొక్కడే ఎదుర్కోవాలని చెప్పాడు. అయితే, ఈ మాటలు బాలీవుడ్‌ను కదిలించాయి.
దీంతో చాలా మంది వరుసగా అతడికి సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. మొదటగా నటుడు సోనూ సూద్ స్పందించారు. కొంత సాయం అందిస్తున్నట్లు చెప్పారు. తనలాగే సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాలని కోరాడు. దీంతో చాలామంది సినీ ప్రముఖులు, టీవీ రంగ ప్రముఖులు అతడికి సాయం చేస్తున్నారు. స్టార్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, పొలిటీషియన్స్.. ఇలా పలువురు సాయం అందిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, వరుణ్ ధావన్, అనీస్ బజ్మీ, గుర్మీత్ చౌదరి, డేవిడ్ ధావన్, రతన్ నైన్, కమల్ ఆర్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ సహా పలువురు ప్రముఖులు తలా కొంత సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జెమ్ ట్యూన్స్ సంస్థ అధినేత, రావ్ ఇంద్రజీత్ సింగ్ యాదవ్.. తన సంస్థ తరఫున రూ.1.1 కోట్లు సాయం చేస్తానని ప్రకటించారు.
అలాగే రాజకీయ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ రూ.11 లక్షలు ప్రకటించారు. రాజ్‌పాల్ యాదవ్ దర్శకుడిగా 2012లో రూపొందించిన అటా పటా లాపటా అనే సినిమాకు నష్టాలు రావడంతో అప్పుల్లో కూరుకుపోయారు. వాటికి సంబంధించి చెల్లించాల్సిన రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో అతడు కోర్టులో లొంగిపోయాడు. అతడు డబ్బు చెల్లించేందుకు ఇంకాస్త సమయం కోరినప్పటికీ ఢిల్లీ కోర్టు నిరాకరించింది. దీంతో తన దగ్గర డబ్బులు లేవని చెబుతూ రాజ్‌పాల్ యాదవ్ కోర్టులో లొంగిపోయాడు. మరోవైపు అతడికి రెండు రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందని అతడి మేనేజర్, లాయర్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

