Transgenders | పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 11 : పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఉన్న పెద్దపల్లి మున్సిపాలిటీకి జరుగుతున్నఎన్నికల్లో మేము సైతం అంటూ ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలోని 22వ వార్డులో జ్వాలాముఖీ, రిషిత అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్య దేశంలో తమ ఓటును డబ్బులకు అమ్ముకోకుండా నిర్భయంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు