చెన్నూరు : రాజ్యాంగ విలువను, ఎన్నికల విధానాలను రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ తుంగలో తొక్కారు. పోలింగ్ జరుగుతున్న రోజున(బుధవారం)సైతం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో మంత్రి ప్రచారం చేశారనే విమర్శలు వస్తున్నాయి. చెన్నూర్ NP వాడాలో 4, 5 బూత్ లలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి బైక్ పై తిరుగుతూ ప్రచారం చేశారు. దాదాపు మధ్యాహ్నం 12.25 గంటల సమయంలో బైక్ పై తిరుగుతూ ప్రచారం చేస్తూ కెమెరా కంట పడ్డారు.
ఇందుకు సంబంధించి న ఫోటోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్న సైతం ఇదే తరహాలో క్యాతన్ పల్లి, చెన్నూరు మున్సిపాలిటీ ల్లో తిరుగుతా మంత్రి ప్రచారం చేశారు. దీంతో రాజ్యాంగం, ఎన్నికల కమిషన్ అంటే గౌరవం లేదా.. విచ్చల విడిగా ఇలా అధికార దుర్వినియోగం చేయడం ఏంటి.. మంత్రి స్థాయు వ్యక్తి ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత జరుగుతున్న అడ్డుకోవాల్సిన ఎన్నికల సంఘం, అధికారుల తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.