భద్రాద్రి కొత్తగూడెం. ఫిబ్రవరి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పాల్వంచ జగ్గు తండాలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇల్లెందు, అశ్వరావుపేట, కొత్తగూడెం పట్టణాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగతుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టర్ పోలింగ్ సరళని పరిశీలిస్తున్నారు.

కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్