IND vs SL : గాలే టెస్టులో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్(167) ద్విశతకం చేజార్చుకున్నాడు. రెండో రోజు కూడా శ్రీలంక బౌలర్లను విసిగించిన ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను ఎట్టకేలకు ప్రభాత్ జయసూర్య(2-92) వెనక్కి పంపాడు. టెస్టుల్లో తొలి శతకాన్నే డబుల్ సెంచరీగా మలచాలనుకున్న అతడు ఔటవ్వడంతో ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం ధ్రువ్ జురెల్(19 నాటౌట్), రవీంద్ర జడేజా(1 నాటౌట్)లు ఆడుతున్నారు.
సుదీర్ఘ ఫార్మాట్లో ఛతేశ్వర్ పూజారా అనంతరం మూడో స్థానంలో నేను సరిపోతాను అని శతకంతో చాటిన దేవ్‌దత్ పడిక్కల్(167 : 230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) ఔటయ్యాడు. మొట్టమొదటి సెంచరీతో భారత జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేసిన ఈ కుర్రాడు రెండో రోజు లంచ్ తర్వాత వెనుదిరిగాడు. ఓవర్ నైట్ స్కోర్ 288/2తో ఆట మొదలెట్టిన టీమిండియా.. చూస్తుండగానే రిషభ్ పంత్(39), కేఎల్ రాహుల్(82) వికెట్లు కోల్పోయింది.
The runs keep flowing in Galle from Devdutt Padikkal’s bat ✨
1⃣5⃣0⃣ comes up for the left-handed batter 👏👏
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/sF7bk3USgI
— BCCI (@BCCI) August 16, 2026
వెంటవెంటనే ఇద్దరూ ఔటైన వేళ.. ధ్రువ్ జురెల్(19 నాటౌట్) ఇన్నింగ్స్ నిర్మించిన పడిక్కల్.. డబుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో ఆగిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(4 నాటౌట్)..జురెల్ ఆచితూచి ఆడుతున్నారు. 94 ఓవర్లకు 364/5తో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన 450 పస్ల్ కొట్టాలంటే ఈ ఇద్దరూ క్రీజులో నిలవాల్సిందే.