AP Forest officers | ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రత్యేకించి పోలీసులైతే ఆన్ డ్యూటీలో ఏది చేయాలన్నా ఆచితూచి చేయాల్సి ఉంటుంది. ఈ సోషల్ మీడియా యుగంలో కొంచెం ఆదమరిచినా అంతే సంగతి. ఉద్యోగాలు పోవడమో.. విమర్శల పాలు కావడమో జరుగుతుంది. ఇలాంటి ఘటనే ఒకటి ఇండిపెండెన్స్ డేన అల్లూరి జిల్లాలో వెలుగుచూసింది.
అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో దేశభక్తికి సంబంధించిన పాటలు ప్లే చేయాల్సింది పోయి మంచి ఊర మాస్ జానపద గీతాన్ని ప్లే చేశారు. అంతటితో ఆగకుండా ఆ పాటకు ఖాకీ యూనిఫాంల్లోనే డ్యాన్స్ చేశారు. ఇంతకీ ఆ పాటేంటంటే ఇండియా మొత్తాన్ని షేక్ చేసి నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్రాబడుతున్న ‘రాను బొంబాయికి రాను’.
సివిల్ డ్రెస్స్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఈ పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. పక్కనే యూనిఫాంలో ఉన్న మహిళా పోలీసాఫీసర్లు కూడా ఆయనతో కలిసి స్టెప్పులేశారు. ఎప్పుడూ డ్యూటీ ఒత్తిళ్లతో ఉండే అధికారులు ఇలా డ్యాన్స్ చేయడం ఒకే కానీ.. ఇండిపెండెన్స్ డే లాంటి ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఇలాంటి పాటకు డ్యాన్స్ చేయడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ పాటకు ఆంధ్ర పోలీసుల స్టెప్పుల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తెలంగాణ పాటకు ఆంధ్ర పోలీసుల స్టెప్పులు
అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి, ‘రాను బొంబాయికి రాను’ పాటకు స్టెప్పులేసిన ఉద్యోగులు pic.twitter.com/n3OXJXl6Ro
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2026