నల్లగొండ, ఫిబ్రవరి 11 : నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు పోలింగ్ కొనసాగుతుంది. జిల్లాలోని 3,09,097 మంది ఓటర్లకు అధికారులు 475 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నల్లగొండ పట్టణంలోని బోయవాడ ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద ట్రాన్స్జెండర్లు జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగంతో ప్రజాస్వామ్యంలో తమ భాగస్వామ్యాన్ని ట్రాన్స్ కమ్యూనిటీ చాటిచెప్పింది. ప్రజాస్వామ్యం అందరిదీ అన్న సందేశాన్ని ఓటుతో ట్రాన్స్జెండర్లు మరోసారి స్పష్టం చేశారు.