Harish Rao | గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లలో సీఎం, మంత్రులు..! హరీశ్‌రావు తీవ్ర విమర్శ
Harish Rao | కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాలకు బయల్దేరారని హరీశ్‌రావు విమర్శించారు.
Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాలకు బయల్దేరారని హరీశ్‌రావు విమర్శించారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్లు జరగడం లేదని హరీశ్‌రావు తెలిపారు. బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోరు అని ధ్వజమెత్తారు. మంత్రి సీతక్క సొంత జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరించరని పేర్కొన్నారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగి గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడటం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు అంటే.. ఇవేవీ పట్టనట్లు, రాష్ట్ర ప్రజలకు సమస్యలే లేనట్లు.. ముఖ్యమంత్రి సహా మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పయనమయ్యారు. పాలన గాలికి వదిలి, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళకు మంత్రి సీతక్క, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్యూ కట్టిన పరిస్థితి ఉంది. గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని బయల్దేరిన ముఖ్యమంత్రి, మంత్రుల్లారా.. మీరు చెప్పిన మార్పు అంటే ఇదేనా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి @UttamINC గారి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవు.
బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి @Bhatti_Mallu గారు పట్టించుకోరు.
మంత్రి @seethakkaMLA గారి జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక… pic.twitter.com/O4fWaIuBKP
— Harish Rao Thanneeru (@BRSHarish) November 9, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి : హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

