Harish Rao | బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి : హరీశ్‌రావు
Harish Rao | జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో స్థానిక సంస్థలకు నిధులు, విధులు, నిర్వహణ పూర్తి స్థాయిలో అప్పగిస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలికారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇప్పుడు మాజీ సర్పంచులు పంచాయితీ భవనాలను తాకట్టు పెట్టే స్థితికి దిగజార్చారు. సర్పంచులు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచుతామని మభ్యపెట్టారు. ఇప్పుడు ఉన్న జీతాల బకాయిలకే దిక్కులేకుండా చేసారు. గ్రామపంచాయితీ సిబ్బందికి కనీస వేతనం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ గురించి కాంగ్రెస్ ఎన్నో ఆశలు కల్పించిన మాటలు రేవంత్ సర్కార్‌కు గుర్తు ఉందా..? మీరు చూపించిన అరచేతిలో స్వర్గం అటుంచి బకాయిలు ముందు విడుదల చేయండి భట్టి విక్రమార్క గారు అని హరీశ్‌రావు అడిగారు.
జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఇలా పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది.
కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో లో స్థానిక సంస్థలకు
“నిధులు, విధులు, మరియు నిర్వహణ”
పూర్తి స్థాయి లో అప్పగిస్తాం అని బీరాలు పలికారు.… pic.twitter.com/V6fcLhb7GQ
— Harish Rao Thanneeru (@BRSHarish) November 9, 2024
ఇవి కూడా చదవండి..
SSC Exams | మార్చిలో పదో తరగతి పరీక్షలు.. 18 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు గడువు
CM Revanth Reddy | రేవంత్‌కు అందని అధిష్ఠానం ఆశీస్సులు.. బర్త్‌డే విషెస్ చెప్పని సోనియా, రాహుల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

