MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని నా దళితబిడ్డలకు రెండో విడుత దళితబంధు నిధులు విడుదల చేసే వరకు పోరాడుతూనే ఉంటాను అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. హుజురాబాద్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బంధు రెండో విడుత నిధుల కోసం దళిత సోదరులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలో చేరిన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవాళ నా చేయి విరగ్గొట్టినా పర్వా లేదు.. నన్ను చంపినా పర్వాలేదు.. కానీ నా దళిత బిడ్డలకు మాత్రం దళితబంధు ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణలోని దళిత బిడ్డలకు కేసీఆర్ దళితబంధు ఇస్తే.. ఈ రేవంత్ రెడ్డి రూ. 12 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. నీవు ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే ఈ విధంగా దాడులు చేయిస్తావా..? లాఠీఛార్జ్ చేయిస్తావా..? అని రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. నన్ను హత్య చేసేందుకు కుట్ర చేశారు. పోలీసుల కుట్రలను నా దళిత సోదరులు అడ్డుకున్నారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని దళిత సోదరులు పోలీసులతో కొట్లాడిన తర్వాత నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. దళిత సోదరులే ఇవాళ నా ప్రాణాలను కాపాడారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రాణం పోయే వరకు నా దళిత బిడ్డల కోసం పోరాడుతా..
దళిత బంధు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఈ విధంగా పోలీసులతో దాడి చేయిస్తారా?
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS pic.twitter.com/5aWnpWmlEz
— BRS Party (@BRSparty) November 9, 2024
ఇవి కూడా చదవండి..
KTR | నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భారీ అవినీతి.. మండిపడ్డ కేటీఆర్
Harish Rao | గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లలో సీఎం, మంత్రులు..! హరీశ్‌రావు తీవ్ర విమర్శ