KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు.. వీళ్ల బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐటీసీ కోహినూర్‌లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటలు సమావేశం జరిగింది.. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి డబుల్ ఇంజిన్‌లో ఒక ఇంజిన్ అదానీ.. మరో ఇంజిన్ ప్రధాని అని మాట్లాడిండు. ప్రధాని కోసం దామగుండం అప్పజెప్పాడు.. అదానీ కోసం రామన్నపేట అప్పజెప్పాడు.. మధ్యలో మూసీ మేఘా కృష్ణా రెడ్డికి.. ఇది రాసిపెట్టుకోండి. ఈడీలు, ఐటీలు కేవలం వీరిని కాపాడడానికి మాత్రమే ఉన్నాయా..? అసలు డీజీపీ, పోలీసోళ్లలాగా ఎవరు ఎప్పుడు అరెస్టు అయితారో అని పొంగులేటి చెబుతుండు. ఈయన హోం మంత్రి, ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతుండు. అసలు ఇది సర్కారా..? సర్కస్సా..? ఈ గొట్టంగాళ్లకు భయపడేవాడు ఎవడు లేడు. వీళ్ల అక్రమసంబంధం బయటపెడుతాం. అన్ని ఒక్కటే రోజు బయటపెడితే ఇవాళే దీపావళి పండుగ అయిపోతది. ఇంకా రాయదుర్గంలో 84 ఎకరాలు, ఐవీఆర్సీఎల్ కంపెనీ వ్యవహారాలు.. ఒక్కొకటిగా వీళ్ళ బట్టలు అన్ని విప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు
పొంగులేటి ఐటీసీ కోహినూర్‌లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు..
రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటలు సమావేశం జరిగింది.. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి
ఇదే రేవంత్ రెడ్డి డబల్ ఇంజన్లో ఒక ఇంజిన్ అదానీ.. ఒక ఇంజన్ ప్రధాని అని… pic.twitter.com/iY9AhvCJe2
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2024
ఇవి కూడా చదవండి..
KTR | 1100 కోట్ల పనులను 5500 కోట్లకు ఎలా పెంచారు.. భారీ కుంభకోణం బయటపెట్టిన కేటీఆర్
KTR | అదే ఈస్టిండియా కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకిచ్చావ్.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం