KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చేపట్టిన కూల్చివేతలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు మీ కుటుంబంలో జరిగితే, అంగీకరించగలరా..? రాహుల్ గాంధీ జీ అని కేటీఆర్ అడిగారు. పట్టింపు, మానవత్వం లేని ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడుతాయి. తెలంగాణలో ఇంట్లో ఇద్దరు మహిళలు ఉండగానే.. బుల్డోజర్లతో ఆ ఇండ్లను కూలగొట్టారు. మరి వారి భౌతిక భద్రతకు ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పేదలకు ప్రేమ పంచుతాం అనడం అంటే ఇదేనేమో అని కేటీఆర్ విమర్శించారు.
If this were to happen to your own family, will you be able to accept it @RahulGandhi Ji?
Only the Most insensitive and inhuman Government can do this!!
Two women are very much inside their house while Bulldozer is ruthlessly destroying their home in Telangana
Who will be… pic.twitter.com/WCrmlLsQkm
— KTR (@KTRBRS) December 14, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి రేవంత్ రెడ్డి..? నిలదీసిన హరీశ్‌రావు
Mohan babu | నేను ఎక్కడికీ పారిపోలేదు.. అజ్ఞాతం వార్తలపై స్పందించిన మోహన్‌బాబు