TGPSC | హైదరాబాద్ : వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1, 3 పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక రేపు, ఎల్లుండి నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ బుక్ చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని ఆయన చెప్పారు.
గ్రూప్-2 ఇప్పటి వరకు నాలుగు సార్లు వాయిదా పడింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో గ్రూప్-2 ఎగ్జామ్‌కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. 5 లక్షల 51 వేల మంది గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకున్నారు. 75 శాతం ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. అభ్యర్థులు ధైర్యంగా పరీక్షలు రాయండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాను అని బుర్రా వెంకటేశం తెలిపారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకం ఉంచి పరీక్షలురాయండి. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుంది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ తప్పనిసరి. వేగంగా గ్రూప్-2 పరీక్షల ఫలితాలు ఇస్తాం. పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించుకున్నాం. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని టీజీపీఎస్సీ చైర్మన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి రేవంత్ రెడ్డి..? నిలదీసిన హరీశ్‌రావు
Mohan babu | నేను ఎక్కడికీ పారిపోలేదు.. అజ్ఞాతం వార్తలపై స్పందించిన మోహన్‌బాబు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపం : హరీశ్‌రావు