KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. రైతులు పండించిన పంటను కొనే దిక్కు లేదు. ఎక్కడో ఒక చోట కొన్నా కూడా ఆ పంటకు బోనస్ ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట ఎంత..? కొన్న ధాన్యం ఎంత..? అని సూటిగా అడిగారు కేటీఆర్. అందులో బోనస్ రూ.500 ఇచ్చింది ఎంత ధాన్యానికి..? అని ప్రశ్నించారు. 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు నీవే చెబుతున్నావు..! ఇదే నిజం అనుకున్నా
ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ రూ.25.98 కోట్లు. మరి ఈ బోనస్ నిజంగానే రైతుల ఖాతాల్లో జమ అయిందా..? అని ప్రశ్నించారు.
రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతన్నలకు కోటి 50 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు ఎగ్గొట్టిన మొత్తం ఎంత..? కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎగ్గొట్టిన మొత్తం ఎంత..? రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఎగ్గొట్టిన మొత్తం ఎంత..? అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కొన్నదేమో పిసరంత.. కోతలు కొండంత అని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పండగలాంటి వ్యవసాయం
ఏడాది కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగగా మారింది.. జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ పేర్కొన్నారు.
పండిన పంట ఎంత ?-కొన్న ధాన్యం ఎంత?
అందులో బోనస్ రూ.500 ఇచ్చింది ఎంత ధాన్యానికి ?
1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు నీవే చెబుతున్నావు !
ఇదే నిజం అనుకున్నా
ఈ లెక్కన రైతులకు దక్కిన… pic.twitter.com/R68xNZ3yxa— KTR (@KTRBRS) November 29, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా.. దీక్షా దివస్‌లో నిలదీసిన హరీశ్‌రావు
Harish Rao | సిద్దిపేటలో దీక్షా దివస్.. ఉద్యమం నాటి రోజులను గుర్తుచేసిన హరీశ్‌రావు