KTR | అధికారం నీ దగ్గర ఉండొచ్చు.. తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్‌కే ఉంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
KTR | బీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది కరీంనగర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
KTR | బీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది కరీంనగర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనదని కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ పదవులు ఆశించకుండా తెలంగాణ కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు అని పేర్కొన్నారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాధించామని తెలిపారు. కానీ ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్లు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆనాడు ఉద్యమంలో మన మీదకు తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా దగ్గర అడుక్కుతినే వాళ్లని తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
ఈరోజు అధికారం నీ దగ్గర ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్ గారికే ఉంది.
– దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ అల్గునూర్ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.#DeekshaDiwas pic.twitter.com/q09T2uZSbS
— BRS Party (@BRSparty) November 29, 2024
రేవంత్ రెడ్డి ఇవాళ అదృష్టవంతుడు.. అధికారం ఆయన దగ్గర ఉందని కేటీఆర్ అన్నారు. అధికారం నీ దగ్గర ఉండొచ్చు కానీ.. తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్‌కు, గులాబీ జెండాకే ఉందని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. దొంగ మాటలు, నంగనాచి కబుర్లు చెప్పి నువ్వు గెలవచ్చు కానీ.. ఏ రోజుకైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ హిమాలయ పర్వతమంతా ఎత్తులో ఉంటే.. కనీసం ఆయన కాలి గోటికి కూడా సరిపోని పాత్రలో ఉంటావనేది అక్షర సత్యమని చెప్పారు. దమ్ముంటే నీ ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలోని ఏ ఊరికైనా, ఏ తండాకైనా, ఏ బస్తీకైనా వెళ్లమని సవాలు విసిరారు.
కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు. ఆఖరకు గురుకులాల్లో ఉండే పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. హాస్టల్లో బువ్వ తిని ఆస్పత్రి పాలయ్యే పరిస్థితి ఉందని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులు తిండి కోసం అలమటిస్తున్నారని అన్నారు. ఇది ఏడాది పాలనలో రాష్ట్ర పరిస్థితి అని అన్నారు. ఈ పాటి దానికి విజయోత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే నాలుగేళ్లు ప్రజల పక్షాన ఉద్యమిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Karimnagar
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

