ఆదిలాబాద్ : అధికారమే పరమావధిగా అమలకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుపై బీఆర్ఎస్(BRS protests) ఉద్యమ బాట పట్టింది. హామీల అమలు కోసం సబ్బండ వర్ణాలను కలుపుకొని కాంగ్రెస్ పాలనపై ఉద్యమిస్తున్నారు. తాజాగా. రైతు భరోసా(Rythu bharosa) కింద రూ.15000 అందజేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ఆందోళన చేపట్టారు.
మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో అదిలాబాద్ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట తప్పి మోసం చేసిందని జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతామన్నారు. కాగా, పోలీసులు శాంతియుతంగా నిరసన చేపడుతున్న జోగు రామన్న అడ్డుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Suryapeta | భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
N. Kiran Kumar Reddy | వైఎస్ బతికున్నా.. తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదు: ఉమ్మడి ఏపీ చివరి సీఎం