Suryapeta | సూర్యాపేట : ఓ ఇద్దరు భార్యలు తమ భర్త పట్ల మృగాళ్లా మారారు. భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. కలిసికట్టుగా అతడిని కడతేర్చారు. ఈ దారుణ ఘటన చివ్వెంల మండలం గుర్రంతండాలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇక భర్తపై కక్ష పెంచుకున్న భార్యలు.. అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం అర్ధారత్రి రోకలి బండతో కొట్టిచంపారు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్తను చంపిన ఇద్దరు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | భోగి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. VIDEO
KCR | రైతులు.. వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి: కేసీఆర్