KTR | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి (Bhogi) పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. సామాన్య ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు.
ఎల్బీనగర్ (LB Nagar) ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్, పట్లోల్ల కార్తిక్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
భోగి మంటల వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు పట్లోల్ల కార్తిక్ రెడ్డి pic.twitter.com/NCzQXAneeV
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో జరిగిన భోగి మంటల వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు pic.twitter.com/GjgPd4wzzw
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025
Also Read..
MLC Kavitha | తెలంగాణ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు : ఎమ్మెల్సీ కవిత
Bhogi | పల్లెల్లో పొంగల్ సందడి.. వీధుల్లో భోగి మంటలు, రంగవల్లులు